రావులపాలెం ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన చోడే వెంకటేశ్వరప్రకాశానికి అరుదైన గౌరవం..

Published : 01 Mar 2020 01:11 IST

రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన చోడే వెంకటేశ్వరప్రకాశానికి అరుదైన గౌరవం దక్కింది. గత 19 ఏళ్లుగా అదే పాఠశాలలో అయన తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి ఇవాళ పదవీవిరమణ పొందారు. దీంతో విద్యార్థులు ఆయన్ను విద్యార్థులు పల్లకిలో కూర్చోబెట్టి భుజాలపై మోసుకుంటూ గ్రామమంతా ఊరేగించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో జరిగిన సత్కారసభలో పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ ఇంత అరుదైన గౌరవం దక్కడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. గతంలో ఆయన ఎందరో పేద విద్యార్థులకు అర్థికంగా సహాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని