కరోనాకు ముందు జాగ్రత్తగా ఆయుష్‌ ఔషధాలు

గత కొన్నిరోజులుగా చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. అంతకంతకూ ఉగ్రరూపం...

Updated : 27 Dec 2022 18:44 IST

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వైరస్‌ రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయుష్‌ విభాగం ఔషధాలను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం ప్రకారం హోమియోపతి మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హోమియోపతి మందులను ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ హోమియోపతి మందులను మూడు రోజుల పాటు రోజుకు ఆరు చొప్పున వేసుకోవాలి. ఏడాది లోపు చిన్నారులకు రోజుకు మూడు చొప్పున తల్లిపాలలో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని ఆయుష్‌ వైద్యులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు