పుల్వామాదాడి కేసు: తండ్రీ కూతుళ్ల ఆరెస్టు

దిల్లీ: గత ఏడాది సీఆర్‌పీఎఫ్ బలగాలే లక్ష్యంగా జరిగిన పుల్వామా బాంబుదాడిలో సంబంధమున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు జాతీయదర్యాప్తు సంస్థ

Published : 03 Mar 2020 20:08 IST

దిల్లీ: గత ఏడాది సీఆర్‌పీఎఫ్ బలగాలే లక్ష్యంగా జరిగిన పుల్వామా బాంబుదాడిలో సంబంధమున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు జాతీయదర్యాప్తు సంస్థ మంగళవారం తెలిపింది. పుల్వామా ప్రాంతంలో నివసించే షకీర్‌ మాగ్రెయ్‌ ప్రధాన నిందితుడైన అదిల్అహ్మద్‌దార్‌కు ఆవాసంతో పాటు దాడికి కావాల్సిన సామాగ్రిని, వాహనాలను సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. దాడికి కొన్నిరోజుల ముందే అహ్మద్‌దార్‌తో పాటు మరికొంతమంది జైషేమహ్మద్‌ ఉగ్రవాదసంస్థకు కొంతమందిని షకీర్‌ కలిసినట్టు తెలుస్తోంది. షకీర్‌కు పుల్వామా ప్రాంతంలో ఒక ఫర్నీచర్‌ దుకాణం ఉంది.  పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదసంస్థ జైషేమహ్మద్‌కు చెందిన మహ్మద్‌ ఉమర్‌ ఫరూఖ్‌ 2018లో అహ్మద్‌దార్‌ను షకీర్‌కు పరిచయం చేశాడు. అప్పటినుంచి షకీర్‌ వారికి సహాయం చేస్తూనేఉన్నాడు. ఈ క్రమంలోనే బాంబుదాడికి కావాల్సిన వస్తువులన్నీ ఒక ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా సేకరించాడు. దర్యాప్తులో అనేకసార్లు జైషే నుంచి భారీమొత్తంలో నగదు, పేలుడు పదార్థాలు తీసుకుని తన ఇంటిలో భద్రపరిచినట్టు వెల్లడించాడు. షకీర్‌తో పాటు అతని కుమార్తెను కూడా గత శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తునట్టు ఎన్‌ఐఏ సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని