‘మెట్రో ప్రయాణికులూ..ఆందోళన చెందొద్దు’

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో మెట్రో రైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్ని మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రజలు తాకే ప్రదేశాల్లో ప్రత్యేకంగా పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

Published : 04 Mar 2020 01:25 IST

కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం: ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో మెట్రో రైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్ని మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రజలు తాకే ప్రదేశాల్లో ప్రత్యేకంగా పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే మెట్రో రైల్లో కరోనాపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు అనౌన్స్‌మెంట్‌ చేస్తామన్నారు. కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలపై మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందవద్దని ఎన్వీఎస్‌ రెడ్డి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని