Published : 04 Mar 2020 17:36 IST

కరోనాను ఎమర్జెన్సీలా పరిగణించాలి: కేజ్రివాల్‌

దిల్లీ: దేశంలోకి ప్రవేశించి వేగంగా వ్యాపిస్తున్న కరోనాను ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థతి)లా పరిగణించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌  డిమాండ్ చేశారు. దేశ రాజధాని దిల్లీలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆప్‌ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన బుధవారం తెలిపారు. వైరస్‌ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పరిస్థితిని ఎమర్జెన్సీలా భావించి పని చేయాలని టాస్క్‌ఫోర్స్‌ సభ్యులకు సూచించినట్లు ఆయన తెలిపారు. అవసరమైతే లేడీ హార్డింగ్ ఆసుపత్రి, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రివాల్‌ ప్రకటించారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తితో దిల్లీకి వచ్చిన 88 మందిని అధికారులు గుర్తించినట్లు, వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేసినట్లు చెప్పారు.
కాగా.. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 28కి చేరింది. దుబయ్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌ యువకుడికి కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. గతంలో కేరళలో మూడు కేసులు నిర్ధారణ అయినప్పటికీ ఆ బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని