Published : 04 Mar 2020 21:19 IST

కరోనా వస్తుందని అప్పుడే తెలుసా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా(కొవిడ్‌19)వైరస్‌. దీన్ని ఎలా నివారించాలో తెలియక ప్రపంచదేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వ్యాధి ఒకటి వస్తుందని కొందరు ముందుగానే గుర్తించారు. మొన్నామధ్య ‘ది ఐస్‌ ఆప్‌ డార్క్‌నెస్‌’ అనే పుస్తకంలో ఇలాంటి వైరస్‌ ఒకటి వస్తుందని రాసుంది. ఈ పుస్తకాన్ని డీన్‌నోట్జ్‌ అనే అమెరికన్‌ రచించారు. ఇలాంటి విషయాన్నే సెల్వియా బ్రౌనే అనే మరో అమెరికన్‌ రచయిత చెప్పింది. ఆమె 2008లో రచించిన ‘ఎండ్‌ ఆఫ్‌ డేస్‌’ అనే పుస్తకంలో ‘‘2020వ సంవత్సరంలో ఒక ప్రమాదకరమైన వైరస్‌ ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. ఇది ఊపిరితిత్తులపైన, ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశాలు దాని నియంత్రణకు ప్రయత్నించినప్పటికి దానంతట అదే మాయమౌతుంది. పదేళ్ల తర్వాత మరోసారి వచ్చి పూర్తిగా కనిపించకుండాపోతుంది’’ అని రాసింది. ఒకరు ఈ వ్యాఖ్యాలను సామాజిక మాధ్యమాలలో ఉంచగా నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. వైరల్‌గా మారిన ఆ పుస్తకాన్ని మీరు చూడండి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని