కరోనా ఎఫెక్ట్‌: 150 విమానాలు రద్దు

కరోనా ప్రభావం విమాన సర్వీసులపై పడింది. జర్మనీకి చెందిన దిగ్గజ విమాన ఎయిర్‌లైన్స్‌ లుఫ్తాన్సా 150 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ 750 విమానాల ద్వారా ప్రపంచదేశాలకు సర్వీసులు అందిస్తోంది.

Published : 05 Mar 2020 00:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ప్రభావం విమాన సర్వీసులనూ వదల్లేదు. వైరస్‌ ధాటికి జర్మనీకి చెందిన దిగ్గజ విమాన ఎయిర్‌లైన్స్‌ సంస్థ లుఫ్తాన్సా 150 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ 750 ప్రపంచదేశాలకు సర్వీసులను అందిస్తోంది. 25 సుదూర దేశాలకు వెళ్లే విమానాలతో పాటు మరో 125 విమానాల సర్వీసులు కొంతకాలం పాటు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది. దీంతో తమ 

సంస్థ నుంచి  25 శాతం విమానాలు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఇటలీతో పాటు వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్‌ లక్షణాలు బయటపడ్డ జర్మనీలోని పలు ప్రాంతాలకూ సర్వీసులను రద్దు చేసింది. అంతేకాకుండా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో సంస్థ కొత్త నియామకాలను సైతం నిలిపివేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌ వల్ల ప్రపంచ విమానయానరంగానికి 4-5 బిలియన్‌ డాలర్లు నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని