ఈ కారు కరోనాను అడ్డుకుంటుంది..!

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే 3వేలకు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 95వేల మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్‌ను అడ్డుకునేందుకు...

Updated : 06 Mar 2020 10:38 IST

బీజింగ్‌(చైనా): కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే 3వేలకు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 95వేల మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్‌ను అడ్డుకునేందుకు ఇప్పటికీ ఎలాంటి వాక్సిన్‌ దొరక్కపోవడంతో చైనా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈక్రమంలో చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ గీలి ముందడుగు వేసింది. వైరస్‌ నుంచి రక్షణ కల్పించే వ్యవస్థతో కొత్త ఎస్‌యూవీ(స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌)ను తీసుకొచ్చింది.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఇటీవల ఐకాన్‌ పేరుతో ఒక ఎస్‌యూవీ కార్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారులో పొందుపరిచిన వడపోత వ్యవస్థ(ఇంటిలిజెంట్‌ ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌) ప్రమాదకరమైన వైరస్‌ను కారు నుంచి బయటికి పంపించి లోపల ఉన్న వారికి రక్షణ కల్పిస్తుంది. 0.3మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న కణాలను గుర్తించే సామర్థ్యం ఉన్న ఈ కారు ఎన్‌95 సర్టిఫికేట్‌ కూడా పొందిందని సంస్థ ప్రతినిధులు ఒక సమావేశంలో చెప్పారు. అధికారికంగా కారును మార్కెట్‌లోకి విడుదల చేయకముందే 30వేల ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

ఇప్పటికే దాదాపు అన్ని కార్లలోనూ ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ వ్యవస్థ అందుబాటులో ఉండగా ఎన్‌95 వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి. చైనా, ఇండియా వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్న కాలుష్యంతో ముప్పు ఉన్నందున కార్ల తయారీదారులు వడపోత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని