షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్‌ అలీ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి,

Updated : 06 Mar 2020 08:22 IST

హైదరాబాద్‌: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్‌ అలీ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనికుమార్‌, షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి స్వాతి లక్రా, సినీ నటి అంజలి, ఎమ్మెల్యే పాషా ఖాద్రి, విద్యార్థినులు, మహిళా కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ... మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. షీ బృందాలు మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని, భరోసా సెంటర్లు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసు శాఖలో 17వేల పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. తెలంగాణ దేశంలోనే శాంతిభద్రతల పరిరక్షణలో ముందుందన్నారు. షీ టీమ్స్‌ రాకతో మహిళలు అర్ధరాత్రి కూడా ధైర్యంగా తిరుగుతున్నారన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని