తెలంగాణ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదలైంది. ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ పురుషోత్తం ఐసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను...

Published : 07 Mar 2020 00:16 IST

హైదరాబాద్: తెలంగాణ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదలైంది. ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ పురుషోత్తం ఐసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30 తుది గడువుగా నిర్ణయించారు. రూ.500 ఆలస్య రుసుముతో మే 14 వరకు, రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 16 వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మే 20, 21 తేదీల్లో ఐసెట్‌-2020 పరీక్షను నిర్వహించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని