కరోనా‌: ఉచితంగా మాస్క్‌లు తీసుకుంటున్నారా?

ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మాటే. అత్యధిక జనాభాగల భారత్‌లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు,

Published : 07 Mar 2020 08:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మాటే. అత్యధిక జనాభాగల భారత్‌లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇస్తున్నాయి. మరోవైపు సామాజిక మాధ్యమాల వేదిక అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

కరోనా సోకకుండా ఉండేందుకు ప్రజలు మాస్క్‌లు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలని చెబుతుండటంతో, అందరూ మాస్క్‌లు కొనేందుకు మందుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా దుకాణదారులు వాటి ధరలను అమాంతం పెంచేశారు. అయితే, కొందరు ఉచితంగా మాస్క్‌లు ఇస్తే ఆలోచించి తీసుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ అయింది. కారులో వస్తున్న వారిని ఆపి ఓ యువతి మాస్క్‌లు ఇవ్వగా, వాటిని పెట్టుకోగానే వాళ్లు స్పృహ కోల్పోయారు. అనంతరం కారులో ఉన్న వాళ్ల సెల్‌ఫోన్‌లను యువతి ఎంచక్కా తీసుకెళ్లిపోయింది. ఇలా వచ్చి మాస్క్‌లు ఇచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు, కొన్ని ఫన్నీ వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 



 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని