అంతరిక్షంలో పాదరక్షలపై పరిశోధన

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) భూమి నుంచి పలు పదార్థాలు, వస్తువులను పంపి పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి పాదరక్షలు కూడా చేరాయి. ప్రముఖ షూ కంపెనీ ‘అడిడాస్‌’ అంతరిక్షంలో

Published : 07 Mar 2020 21:52 IST

వాషింగ్టన్‌ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) భూమి నుంచి పలు పదార్థాలు, వస్తువులను పంపి పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి పాదరక్షలు కూడా చేరాయి. ప్రముఖ షూ కంపెనీ ‘అడిడాస్‌’ అంతరిక్షంలో పాదరక్షలకు సంబంధించి పరిశోధనలు చేపట్టనుంది. ఇందుకోసం షూ సోల్స్‌ తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్‌తో తయారుచేసిన డజన్ల కొద్ది గుళికలను అక్కడికి పంపించింది. ఫ్లోరిడాలోని కేప్‌కెనావెరల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి  స్పేస్‌ఎక్స్‌ ప్రయోగం ద్వారా ఇవి ఐఎస్‌ఎస్‌కు చేరుకోనున్నాయి. మరింత సౌకర్యవంతమైన పాదరక్షలు తయారుచేసేందుకు అక్కడ వీటిపై పరిశోధనలు జరపనున్నారు.

అడిడాస్‌ ప్లాస్టిక్‌ గుళికలు రెండు రకాల విభిన్నమైన పాలీమర్స్‌తో రూపొందుతాయి. అవి అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో ఏ విధంగా రూపాంతరం చెందుతాయో పరిశోధనలు చేపట్టనున్నారు. ఈ పరిశోధనల ద్వారా తమ పరిశోధకులకు వీటిపై మరింత అవగాహన కలగనుందని అడిడాస్‌ పేర్కొంది. అథ్లెట్లకు మెరుగైన పనితీరు, సౌకర్యవంతమైన ప్రయోజనాలను అందించగల షూ సోల్స్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని అడిడాస్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ హెన్నీ హాన్సన్‌ వెల్లడించారు.

అంతరిక్షంలోకి ఇలాంటి వాటిని పంపడం కొత్తేమీ కాదు. 2015లోనే ‘బడ్‌వైజర్‌’ కంపెనీ బార్లీ గింజలను ఐఎస్‌ఎస్‌కు పంపి పరిశోధనలు చేపట్టింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రైవేట్‌ కంపెనీల ద్వారా 200కుపైగా పరిశోధనలు జరిగాయి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని