మద్యం కరోనాను అడ్డుకుంటుందా..?

కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా 90పైగా దేశాల్లో వ్యాపించింది. భారత్‌లోకి కూడా వైరస్‌ ప్రవేశించింది. ఇప్పటికే 34కేసులు  నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ దొరకలేదు.

Published : 08 Mar 2020 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో వ్యాపించిన ఈ మహమ్మారి భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు 34 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ దొరకలేదు. అయితే, పలు అపోహలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌ఓ) తేల్చి చెప్పింది.

మద్య తాగడం

ఎక్కువగా వినిపిస్తున్న వార్తల్లో మద్యపానం కరోనాను అడ్డుకుంటుందనేది ఒకటి. మద్యం తాగడం లేదా ఒంటిపై చల్లుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చని కొంత ప్రచారం జరుగుతోంది. అయితే, కరోనాను అడ్డుకునే సామర్థ్యం మద్యానికి లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

శరీరంపై క్లోరిన్‌ చల్లడం

శరీరంపై క్లోరిన్‌ చల్లితే వైరస్‌ను సంహరించవచ్చని కూడా వార్తలు వినిపించాయి. ఇందులోనూ నిజం లేదని డబ్య్లూహెచ్‌ఓ పేర్కొంది. కొన్ని రకాల వైరస్‌లను అంతం చేసే సామర్థ్యం క్లోరిన్‌కు ఉన్నప్పటికీ కరోనాను మాత్రం ఇది నాశనం చేయలేదని తెలిపింది.

వేడి నీటితో స్నానం చేయడం

వేడినీటితో స్నానం చేయడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చన్న వాదన కూడా సరైంది కాదని ఆరోగ్య సంస్థ తెలిపింది. కాకపోతే వేడినీటితో స్నానం చేయడం వల్ల ఇతర అంటు రోగాల నుంచి దూరంగా ఉండవచ్చని పేర్కొంది.

చైనా వస్తువుల ద్వారా

కరోనా ప్రభావంతో చైనాలో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలంటే చాలా మంది జంకుతున్నారు. అయితే, చైనాలో తయారై వచ్చిన వస్తువుల ద్వారా కరోనా వ్యాప్తి సాధ్యం కాదని తేలింది. కరోనా వైరస్‌ భూమి మీద పడితే కొద్ది సేపటికే మరణిస్తుందని తెలిపింది. దానికి మనిషి శరీరం, చల్లని ప్రదేశాల్లో తప్పితే మరెక్కడా బతికేందుకు అనుకూలం కాదని పేర్కొంది.

చేతులు శుభ్రంగా కడుక్కోవడం

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం చేతులను శానినైజర్‌ లేదా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం. అలాగే నోటికి, ముక్కుకు మాస్కు ధరించడం వల్ల వైరస్‌ నుంచి దూరంగా ఉండవచ్చని సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని