30ఎంఎల్‌ శానిటైజర్‌ రూ.999..!

కరోనా వైరస్‌ ప్రభావంతో మొన్నటికిమొన్న మాస్కుల ధరలు మూడింతలయ్యాయి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది శానిటైజర్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Published : 09 Mar 2020 01:30 IST

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో మొన్నటికిమొన్న మాస్కుల ధరలు మూడింతలయ్యాయి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తుండటంతో ప్రజలు శానిటైజర్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో మెడికల్‌ షాపులు, కిరాణాల్లో స్టాక్‌ అయిపోయింది. దీంతో వినియోగదారులు ఆన్‌లైన్‌ వైపు మళ్లారు. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలు శానిటైజర్‌ ధరలను ఏకంగా 16రెట్లు పెంచేశాయి. 30మిల్లీలీటర్ల హిమాలయ శానిటైజర్‌ బాటిల్‌ను రూ.999లకు విక్రయిస్తున్నాయి. గత్యంతరం లేక కొంతమంది వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా హిమాలయ తయారీ సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. ‘డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచితే ఎలా.. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా..?’ అని ఆన్‌లైన్‌ సంస్థలను ప్రశ్నిస్తున్నారు. ఇలా ధరలు పెంచిన విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన హిమాలయ.. బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ట్విటర్‌ వేదికగా పేర్కొంది. శానిటైజర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని, కొంతమంది థర్డ్‌ పార్టీ వ్యాపారులు అక్రమంగా ధరలు పెంచుతూ విక్రయాలు సాగిస్తున్నారని సంస్థ తెలిపింది. వాళ్లతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా.. కేరళలో తాజాగా ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 39కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని