ఆ ఛార్జీలు రద్దు చేసిన గోఎయిర్‌

కరోనా ప్రభావంతో విమానయాన సంస్థ గోఎయిర్‌ పలు ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకున్నా లేదా రీషెడ్యూలింగ్‌ చేసుకున్నా అలాంటి.....

Published : 08 Mar 2020 22:31 IST

ముంబయి: కరోనా ప్రభావంతో విమానయాన సంస్థ గోఎయిర్‌ పలు ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకున్నా లేదా రీషెడ్యూలింగ్‌ చేసుకున్నా అలాంటి సేవలపై ఛార్జీలు వసూలు చేయబోమని సంస్థ ప్రకటించింది. మార్చి 8 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య కాలంలో ప్రయాణానికి సంబంధించి మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ చేసిన బుకింగ్‌లకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.

ప్రయాణం ప్రారంభమవడానికి 14రోజుల ముందే టికెట్ల రద్దు లేదా రీబుకింగ్‌ చేసుకున్నవారి నుంచి మాత్రమే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రీషెడ్యూలింగ్‌కు ఎలాంటి సర్వీస్‌ ఛార్జీ వసూలు చేయనప్పటికీ విమాన టికెట్ల ధరల్లో ఉన్న వ్యత్యాసాలను మాత్రం ప్రయాణికులు భరించాలని తెలిపింది. అంతకుముందు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కూడా మార్చి 12 నుంచి 31 మధ్య చేసుకునే రీషెడ్యూలింగ్‌కు ఎలాంటి ఛార్జీ వసూలు చేయమని ప్రకటించింది. టికెట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి అవకాశం మాత్రం కల్పించలేదు. 35 గమ్యస్థానాలకు గోఎయిర్‌ నిత్యం 300 విమానాల సర్వీసులను నడుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని