అమృత.. ఆఖరి చూపు చూడకుండానే..

హైదరాబాద్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కుమార్తె అమృత ప్రయత్నించింది.

Updated : 09 Mar 2020 13:21 IST

తండ్రి మృతదేహాన్ని చూడకుండా అడ్డుకున్న బంధువులు


 

మిర్యాలగూడ : హైదరాబాద్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కుమార్తె అమృత ప్రయత్నించింది. మృతదేహాన్ని చూసేందుకు తనకు పోలీసు భద్రత కావాలని ఈ ఉదయం కోరింది. ఈ మేరకు ఆమె పోలీసు భద్రత మధ్య తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు చేరుకుంది. అయితే ఆమె రాకను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహం వద్దకు రాకుండా అమృతను బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తండ్రి మృతదేహాన్ని చూడకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.

అంతకుముందు మారుతీరావు అంతిమయాత్రను పట్టణంలో నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మిర్యాలగూడ నివాసానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మారుతీరావు నివాసం వద్ద ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆయా కూడళ్ల వద్ద పోలీసులు సివిల్‌ డ్రస్‌లో మోహరించి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని అమృత మామ బాలస్వామి నివాసం వద్ద సైతం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి..

చంపేంత చచ్చేంత ప్రేమ

మారుతీ.. హతవిధీ..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని