ఎన్‌జీటీలో బయోమెట్రిక్‌ తాత్కాలిక రద్దు

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఎన్‌జీటీ(నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌) ముందస్తు చర్యలు చేపట్టింది. దిల్లీలోని ఎన్‌జీటీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు హాజరును బయోమెట్రిక్‌ యంత్రంలో వేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

Published : 09 Mar 2020 20:33 IST

దిల్లీ: కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఎన్‌జీటీ(నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌) ముందస్తు చర్యలు చేపట్టింది. దిల్లీలోని ఎన్‌జీటీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు హాజరును బయోమెట్రిక్‌ యంత్రంలో వేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బయోమెట్రిక్‌ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ దిల్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు కార్యాలయాలకు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఉద్యోగులకు కార్యాలయానికి వచ్చిన సమయంతో పాటు వెళ్లిన సమయాన్ని మాన్యువల్‌(చేతి పుస్తకంలో రాయడం) ద్వారా నమోదు చేయాలని ఎన్‌జీటీ సూచించింది. మార్చి 31 వరకూ ఈ విధానం అమలులో ఉంటుందని తెలిపింది.

బయోమెట్రిక్‌ వ్యవస్థను నిలిపివేయాలంటూ కేంద్రప్రభుత్వం మార్చి 6నే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కోరింది. కర్ణాటకలో ఇప్పటికే బయోమెట్రిక్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 41కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 3,300 మందికిపైగా ప్రాణాలు విడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని