హోలీ సందర్భంగా ‘కరోనాసుర’ దహనం!

కరోనా రక్కసికి ఒక ఆకారాన్నిచ్చి, దానిని కనీసం ప్రతీకాత్మకంగానైనా నాశనం చేయాలని నడుం కట్టారు. 

Published : 09 Mar 2020 22:36 IST

ముంబయి:  చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ లేదా హోలికా పూర్ణిమ రోజు సాయంత్రం ‘హోలికా దహనం’ జరపటం సంప్రదాయం. అయితే పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌కే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా రాకాసిగా మారిన సంగతి తెలిసిందే. దాని నివారణకు ప్రపంచ దేశాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. కాగా ఈ విషయంలో ముంబయిలోని వర్లీ ప్రాంత నివాసులు ఓ అడుగు ముందున్నారు. వారు ఈ కరోనా రక్కసికి ఒక ఆకారాన్నిచ్చి, దానిని కనీసం ప్రతీకాత్మకంగానైనా నాశనం చేయాలని నడుం కట్టారు. 

వారు హోలికా దహనం సందర్భంగా కరోనావైరస్‌ భారీ దిష్టిబొమ్మను తయారుచేసి దానికి ‘కరోనాసురుడు’ అనే పేరు కూడా పెట్టారు. దానిని దహనం చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని