ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు: చంద్రబాబు

ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగ జరుపుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ వచ్చిందంటే ఆ ఉత్సాహం ఎంత రంగులమయంగా ఉంటుంతో అందరికీ తెలుసునన్న ఆయన.. ఈ సారి ఆ ఉత్సాహాన్ని

Published : 10 Mar 2020 10:46 IST

అమరావతి: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగ జరుపుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ వచ్చిందంటే ఆ ఉత్సాహం ఎంత రంగులమయంగా ఉంటుంతో అందరికీ తెలుసునన్న ఆయన.. ఈ సారి ఆ ఉత్సాహాన్ని కరోనా వైరస్‌ భయం నీరుగార్చిందన్నారు. పండుగ ప్రతి ఏటా వస్తుంది కాబట్టీ మరేం పరవాలేదంటూ ప్రజలందరికీ ట్విటర్‌లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
రసాయన రంగులకు బదులు సహజసిద్ద రంగులతో సురక్షితంగా హోలీ జరపుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సూచించారు. వసంతోత్సవంగా చెప్పుకునే ఈ పండుగ  ప్రతి ఇంటికీ నిత్య వసంతాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా అని ట్విటర్‌ వేదికగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని