హోలీ నాడు ‘కరోనాసుర’ దహనం!

ఈ సంవత్సరం హోలీ పర్వదినాన్ని ముంబయిలోని వర్లీ ప్రాంత వాసులు వినూత్నంగా జరుపుకున్నారు.

Published : 10 Mar 2020 15:12 IST

ముంబయి: ఈ సంవత్సరం హోలీ పర్వదినాన్ని ముంబయిలోని వర్లీ ప్రాంత వాసులు వినూత్నంగా జరుపుకొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ రోజు సాయంత్రం ‘హోలికా దహనం’ జరపటం సంప్రదాయం. ఈ సందర్భంగా ముంబయి వాసులు కరోనావైరస్‌ భారీ దిష్టిబొమ్మను తయారుచేసి దానికి ‘కరోనాసురుడు’ అనే పేరు కూడా పెట్టారు. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ దిష్టి బొమ్మకు వారు నిప్పంటించారు. వ్యాక్సిన్‌తో కరోనా భూతాన్ని అంతమొందిస్తామనే అర్థం వచ్చేలా టీకాను పోలిన బొమ్మతో కరోనాసురుడికి నిప్పు పెట్టి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు