తెలంగాణలో 16నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌...

Updated : 10 Mar 2020 22:33 IST

హైదరాబాద్‌: వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 23 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు నడపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 24 నుంచి విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని