తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

ఏబీవీపీ చేపట్టిన తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బడ్జెట్‌లో విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని, ఖాళీ ఉద్యోగాలను భర్తీ

Published : 11 Mar 2020 12:41 IST

హైదరాబాద్‌: ఏబీవీపీ చేపట్టిన తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బడ్జెట్‌లో విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ వద్దకు చొచ్చుకొచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని లాఠీ ఛార్జి చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని