కరోనా నుంచి కాపాడుకోండిలా..!

కంట్లో నలతపడినా.. నిద్ర వచ్చినా.. ముక్కు దురదపెట్టినా.. ఆవలింత వచ్చినా క్షణాల్లో మన చేయి ముఖం మీదకు వెళుతుంది. ఇలా.. మనకు తెలియకుండానే మనం గంటకు దాదాపు 16సార్లు ముఖాన్ని చేతులతో తాకుతున్నాం.

Published : 12 Mar 2020 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంట్లో నలతపడినా.. నిద్ర వచ్చినా.. ముక్కు దురదపెట్టినా.. ఆవలింత వచ్చినా క్షణాల్లో మన చేయి ముఖం మీదకు వెళుతుంది. ఇలా.. మనకు తెలియకుండానే మనం గంటకు దాదాపు 16సార్లు ముఖాన్ని చేతులతో తాకుతున్నాం. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏదైనా వైరస్‌ మన శరీరంలోకి వేగంగా ప్రవేశించాలంటే ఇవే ప్రధాన మార్గాలు. ఇలా మాటిమాటికీ ముఖంపై చేతితో తాకడం వల్ల ప్రమాదకరమైన కొత్తకొత్త వైరస్‌లను మన శరీరంలోకి మనమే ఆహ్వానిస్తున్నామన్నమాట. ఇది వైద్యులు చెబుతున్న మాట. ఇది ఎవరికైనా అలవాటుగా వచ్చేది కానీ.. అనుకోని చేసేది కాదు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి..? అనుకుంటున్నారా.. అయితే వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకూ దాన్ని కట్టడి చేసే మార్గం తెలియక.. ముందస్తు జాగ్రత్తే శ్రీరామరక్ష అంటూ అన్ని దేశాలు తమ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే క్రమంగా ప్రధానపాత్ర పోషించేవి మన చేతులు. అందుకే కరోనా బాధితులతో చేతులు కలపడం, వారికి ముద్దు పెట్టడం వంటివి చేయకూడదని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. దీంతోపాటు అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నాయి. 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు..
* చేతులను కడిగిన ప్రతిసారీ కనీసం 20 సెకన్లపాటు రుద్దాలి.
* హ్యాండ్‌వాష్‌ లేదా సబ్బు వాడటం తప్పనిసరి.
* ముఖంపైకి చేతులు వెళ్లకూడదని మైండ్‌లో ఫిక్సైపోవాలి. 
* ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి.
* చేతులను ఖాళీగా ఉంచకూడదు.
* చేతిలో టీవీ రిమోట్‌, పుస్తకం, మరేదైనా వస్తువు ఉండేలా చూసుకోవాలి.
* ఆఫీస్‌లో మీటింగ్‌ ఉన్నా లేక తరగతి గదిలో కూర్చొని ఉన్న సమయాల్లో చేతులను  ఒడిలో పెట్టుకోవాలి.
* అన్నింటి కంటే ముఖ్యంగా చేతులకు గ్లౌవ్స్‌ వేసుకోవడం మంచిది.
* పని చేసే ప్రాంతాల్లోనే కాకుండా ఇంట్లోనూ చేతులకు గ్లౌవ్స్‌ ధరిస్తే మేలని వైద్యులు చెబుతున్నారు.
* ఇక ముఖానికి ముస్కు ధరించడం వల్ల గాలి ద్వారా వచ్చే ఇతర వైరస్‌ల నుంచి రక్షణ పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని