రాజధానికి వచ్చే మహిళల కోసం వసతిగృహం

వివిధ రకాల పనుల నిమిత్తం రాజధానికి వచ్చే మహిళల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక సదుపాయం కల్పించింది. వారి వసతి కోసం ఒక భవనాన్ని కేటాయించింది.

Published : 11 Mar 2020 23:34 IST

తిరువనంతపురం(కేరళ): ఏ రాష్ట్రంలోనైనా రాజధానికి నిత్యం వేలాది మంది జనం రాకపోకలు సాగిస్తుంటారు. అందులో కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఉంటారు. రాత్రి సమయాల్లో నగరానికి చేరుకున్న సమయంలో ఎక్కడి వెళ్లాలో..? ఏ బస్సు ఎక్కాలో తెలియక ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి వారి కోసం కేరళ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వివిధ రకాల పనుల నిమిత్తం రాజధానికి వచ్చే మహిళల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక సదుపాయం కల్పించింది. వారి వసతి కోసం ఒక భవనాన్ని కేటాయించింది. ఈ వసతి గృహాన్ని ఆ రాష్ట్ర మంత్రి శైలజ ఇటీవల ప్రారంభించారు. నగరానికి వచ్చే మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు. మహిళా, శిశుసంక్షేమశాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని త్వరలోనే జిల్లాలకు కూడా విస్తరిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానికి పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థినులతో పాటు ఇతర పనుల మీద వచ్చే మహిళలకూ ఇక్కడ వసతి కల్పిస్తామని తెలిపారు.

పన్నెండు సంవత్సరాల్లోపు పిల్లలు తమ తల్లితో పాటు ఇక్కడ మూడు రోజుల పాటు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఏసీ సదుపాయం కూడా ఉంటుంది. షేరింగ్‌ గదిలో 25 మంది ఉండవచ్చు. అందుకోసం రోజు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది. ప్రత్యేక గది కావాలంటే రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అయితే వసతిగృహంలో ఉండాలనుకునే మహిళలు లేదా విద్యార్థినులు వారి గుర్తింపు కార్డులు సమర్పించడంతో పాటు వారు ఏ కారణం మీద నగరానికి వచ్చారో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రయివేటు వసతిగృహాలల్లో రక్షణ కరవైన నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి శైలజ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని