మొబైల్‌ గేమ్స్‌లో భారత్‌ ర్యాంకు 64

 భారతదేశంలో మొబైల్‌ గేమ్స్‌ పేలవంగా ఆడుతున్నారని, 100 దేశాల్లో 64వ ర్యాంక్‌లో ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నివేదికని ఓపెన్‌సిగ్నల్‌ అనే మొబైల్‌ అనలటికల్‌ కంపెనీ విడుదల చేసింది. ఈ సంస్థ 2019 అక్టోబరు నుంచి 2020 జనవరి వరకు దాదాపు 37 మిలియన్‌ డివైజ్‌ల సమాచారాన్ని సేకరించి, పరిశీలించింది.

Published : 11 Mar 2020 23:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతదేశంలో మొబైల్‌ గేమ్స్‌ పేలవంగా ఆడుతున్నారని, 100 దేశాల్లో 64వ ర్యాంక్‌లో ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నివేదికని ఓపెన్‌సిగ్నల్‌ అనే మొబైల్‌ అనలటికల్‌ కంపెనీ విడుదల చేసింది. ఈ సంస్థ 2019 అక్టోబరు నుంచి 2020 జనవరి వరకు దాదాపు 37 మిలియన్‌ డివైజ్‌ల సమాచారాన్ని సేకరించి, పరిశీలించింది. ఈ సమాచారాన్ని ఉపయోగించి 0 నుంచి 100 పాయింట్ల మధ్య స్కోర్లని నిర్ణయించింది. ఈ స్కోర్ల ఆధారంగా వివిధ ర్యాంకులతో నివేదికని విడుదల చేసింది. ఇందులో 100కి 85.5 పాయింట్ల స్కోరుతో సింగపూర్‌ అగ్రస్థానంలో నిలిచింది. 85.4 పాయింట్లతో నెదర్లాండ్‌ రెండోస్థానంలో, 85.3 పాయింట్లతో జపాన్‌ మూడో స్థానంలో నిలిచాయి. 100లో 28 దేశాలు మాత్రమే మొబైల్‌ గేమ్స్‌ బాగా ఆడుతున్నట్లు వెల్లడైంది. ఈ గేమ్స్‌లో ఎప్పుడు ముందుండే అమెరికా, దక్షిణ కొరియా ఈసారి వరసగా 35, 14వ ర్యాంకుల్లో ఉన్నాయి. 58.4 పాయింట్లతో భారత్‌కు 64 ర్యాంకు దక్కింది. అయితే పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు