బయోమెట్రిక్‌ బంద్‌ ‘కరోనా’!

కరోనావైరస్‌(కొవిడ్‌-19) ప్రభావం విశ్వవిద్యాలయాల్లో హాజరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంతోపాటు అనుబంధ కళాశాలల్లో బయోమెట్రిక్‌ వేలిముద్రల సాయంతో హాజరును తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం

Updated : 13 Mar 2020 07:54 IST

ఓయూలో వేలిముద్రలతో హాజరు తాత్కాలికంగా నిలిపివేత

 హైదరాబాద్‌: కరోనావైరస్‌(కొవిడ్‌-19) ప్రభావం విశ్వవిద్యాలయాల్లో హాజరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంతోపాటు అనుబంధ కళాశాలల్లో బయోమెట్రిక్‌ వేలిముద్రల సాయంతో హాజరును తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ విషయంలో యూజీసీ నుంచి ఆదేశాలు ఉన్నాయి.. మిగిలిన యూనివర్సిటీలు సైతం బయోమెట్రిక్‌ హాజరు నిలిపివేస్తున్నాయి. ఓయూ పరిధిలో తాత్కాలికంగా ఆపమని చెప్పాం’’ అని ఓయూ రిజిస్ట్రార్‌ సీహెచ్‌గోపాల్‌రెడ్డి తెలిపారు. మ్యాన్యువల్‌గా తీసుకునే హాజరు విషయంలో గతంలో అక్రమాలు చోటుచేసుకునేవి. గైర్హాజరు అయినా హాజరైనట్లుగా చూపేవారు. తాజాగా కరోనా ప్రభావంతో మరోసారి పాతపద్ధతికే మారడంతో అప్పటి అక్రమాలకు తెరలేచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు జేఎన్‌టీయూ సహా నగరంలోని మిగిలిన వర్సిటీలు సైతం బయో మెట్రిక్‌ హాజరును తాత్కాలికంగా నిలిపివేసే దిశగా యోచన చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని