పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు  

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని,  వచ్చిన ఫిర్యాదులపై

Updated : 13 Mar 2020 23:45 IST

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని,  వచ్చిన ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఘటన వివరాలు, దర్యాప్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నామని చెప్పారు. మాచర్ల సంఘటనలో దాడికి పాల్పడిన నిందితులను సెక్షన్‌ 307కింద అరెస్టు చేశామని అన్నారు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం గురజాల సబ్‌జైల్లో ఉన్నారని తెలిపారు. పోలీసులకు చెప్పి వెళ్లామంటున్న తెదేపా నేతల వ్యాఖ్యలపైనా విచారణ జరిపిస్తున్నామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని డీజీపీ వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని