
వంశధార కాలువపై కూలిన పురాతన వంతెన
సారవకోట: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బైదలాపురం గ్రామానికి సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై ఉన్న పురాతన వంతెన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వంతెనను 1974లో నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. వంతెనపై నుంచి తరచూ గ్రానైట్ రాళ్లతో భారీ వాహనాలు రాకపోకలు చేయడమే వంతెన కూలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంతెన కూలడంతో బైదలాపురం గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నెల 21న ఎంపీటీసీ, 29న సర్పంచి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులకు అటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న వంశధార అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.