తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు మూసివేత
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ -19) భారత్‌లోనూ చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టింది. జనసందోహాలకు ప్రజలు దూరంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే, శాసనసభ బడ్జెట్ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారంతోనే ముగించాలని నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో సభ నిర్వహించి.. ఆఖరిరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. కొన్ని రోజుల పాటు బహిరంగ సమావేశాలు వద్దనీ.. విందులు, వేడుకలు ఇంటికే పరిమితం చేసుకోవాలని సీఎం ప్రజల్ని కోరారు. ఈ సాయంత్రం 6గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా చర్చించనుంది.
మరోవైపు, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 84కు చేరింది. ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకు భారత్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు