కరోనా ఎఫెక్ట్‌: ఇటలీ వీధుల్లో సంగీతం

కరోనా మహమ్మారి ఇటలీని కుదిపేస్తోంది.  అక్కడి ప్రజలెవ్వరు వీధుల్లోకి రావద్దంటూ ప్రభుత్వం కఠిన నిబంధనల్ని విధించింది.  ఈ ఆంక్షలతో  ఇటలీవాసులంతా స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు. వారంతా ఇతరుల్లో ధైర్యం నింపేందుకు  ఇప్పుడు కీటికీల వద్దకు చేరుకుని గొంతెత్తి పాడుతున్నారు.

Published : 14 Mar 2020 19:04 IST

రోమ్‌: కరోనా మహమ్మారి ఇటలీని కుదిపేస్తోంది.  అక్కడి ప్రజలెవ్వరు వీధుల్లోకి రావద్దంటూ ప్రభుత్వం కఠిన నిబంధనల్ని విధించింది.  ఈ ఆంక్షలతో  ఇటలీవాసులంతా స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు. వారంతా ఇతరుల్లో ధైర్యం నింపేందుకు  ఇప్పుడు కిటికీల వద్దకు చేరుకుని గొంతెత్తి పాడుతున్నారు. ఇలా పాడుతున్న ఈ   వీడియోలను అంతర్జాలంలో  వేలమంది వీక్షిస్తున్నారు. అత్యవసరమయితే తప్ప  బయటకు రావద్దన్న ఆంక్షలతో  అంతా ఇళ్లలోనే ఉండిపోయారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలపై ఇటలీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ప్రముఖ గాయకులు అంతర్జాల వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్నారు. మరోవైపు ఇటలీవాసులు కిటీకీల వద్దకు చేరి ఆ పాటలు పాడుతూ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.  అక్కడ సియానా నగరంలో రికార్డు చేసిన ఒక వీడియోని ట్విటర్‌లో ఆరు లక్షల మంది వీక్షించారు. 

అక్కడి స్థానికులు సంప్రదాయ సంగీతమైన కాంటో డెల్లా వెర్బానా ని ఆలపిస్తూ ‘సియెనా నగరం వర్ధిల్లాలి’ అని పాడుతూ  నగర ప్రజలకు ధైర్యాన్ని చెబుతున్నారు. ఇటాలియన్‌ గాయకుడు ఆండ్రియా సాన్నియో తన పాటను ప్రజలు కిటికీల్లోంచి  పాడుతున్న వీడియోతో పాటు టురిన్‌ నగరంలోని ఒక  భవంతిలోని బాల్కనీలో తన పాటని పాడుతూ మాకరెనా నృత్య ప్రదర్శన చేస్తున్న వీడియోని  చూసి కదిలిపోయానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.  ఈ అద్భుత ఘట్టాన్ని గురించి  ముందు తరాలకు గర్వంగా చెప్పుకుంటన్నానని ఉద్వేగానికి గురయ్యారు.   అంతేకాదు సాయంత్రం 6 గంటలకు అందరూ వాయిద్యాలు వాయించాలన్న వాట్సప్‌ సందేశం చేరవేస్తున్నారు. అలా ఇప్పుడు ఇటలియన్‌ సంగీతంతో వీధులన్ని కొత్త ఉత్సాహాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఇటలీలో కరోనా వల్ల ఇప్పటికే వేయి మంది చనిపోగా, 15 వేల మందికి కరోనా సోకినట్లు సమాచారం..


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని