యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: బాబా రాందేవ్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, భయపడాల్సిన అవసరం లేదని యోగా గురు రాందేవ్‌ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఆయన ఎన్‌ఐతో మాట్లాడుతూ..

Published : 15 Mar 2020 01:36 IST

హరిద్వారా: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని యోగా గురు రాందేవ్‌ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ...'కరోనా వైరస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ వ్యాపించకుండా తగిన నివారణ చర్యలు, జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, బస్సు, రైలు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు శానిటైజర్‌ని వాడండి. అలాగే వేరే వ్యక్తులకు 4 నుంచి 5 అడుగుల దూరంలో ఉండండి. తప్పనిసరిగా మాస్కులను ధరించండి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ యోగా సాధన చేయండి. ఉబ్బసం, గుండె జబ్బులు, మధుమేహం చికిత్సలు తీసుకునే వారు సహజమైన జీవనశైలిని అనుసరించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వారు తొందరగా కోవిడ్‌ 19 బారిన పడే అవకాశం ఉంది' అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని