పార్లమెంటులో సందర్శకుల పాసులు రద్దు

కరోనా మరింత ప్రభావితం అవుతున్న క్రమంలో పార్లమెంటులోని గ్యాలరీలోకి సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ మేరకు లోక్‌సభ జనరల్‌ సెక్రటరీ స్నేహలతా శ్రీవాత్సవ శనివారం ప్రకటించారు.

Published : 15 Mar 2020 01:37 IST

దిల్లీ: కరోనా రోజురోజుకూ వ్యాపిస్తున్న క్రమంలో పార్లమెంటులోకి సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ మేరకు లోక్‌సభ జనరల్‌ సెక్రటరీ స్నేహలతా శ్రీవాత్సవ శనివారం ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్లమెంటులోని పబ్లిక్‌ గ్యాలరీలోకి ప్రవేశం నిమిత్తం సందర్శకులకు ఇచ్చే పాసులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సందర్శకులకు ప్రవేశం ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు శాసనసభల్లో సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని