కరోనా మీకు..నాకు కాదు..పెంగ్విన్‌ ఆకర్షణ!

కరోనా ప్రభావంతో చికాగోలోని షెడ్‌ అక్వేరియంని మూసేశారు. అక్కడంతా సందర్శకులు లేక ఆ ప్రాంతం బోసిపోయింది.  ఇదే అదును అనుకుందో ఏమో ఓ పెంగ్విన్‌ ఆ భవనం చుట్టూ క్షేత్ర స్థాయిలో  పర్యటించేసింది.

Published : 17 Mar 2020 01:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా ప్రభావంతో చికాగోలోని షెడ్‌ అక్వేరియంని మూసేశారు. అక్కడంతా సందర్శకులు లేక ఆ ప్రాంతం బోసిపోయింది.  ఇదే అదును అనుకుందో ఏమో ఓ పెంగ్విన్‌ ఆ భవనం చుట్టూ క్షేత్ర స్థాయిలో  పర్యటించేసింది. సముద్ర ప్రపంచంలోని ఇతర జీవులని కలవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. దాన్ని ఆ ప్రదేశం బాగా ఆకట్టుకున్నట్లుంది. మూసేసిన అక్వేరియంని సందర్శించిన పెంగ్విన్‌ వీడియోని ఆ అక్వేరియం అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
ఈ వీడియో చాలా మంది అభిమానులను ఆకర్షించింది. పోస్ట్‌ చేసిన 14 గంటల్లోనే 8200కు పైగా ట్వీట్లు, లైకులు, 3,700కు పైగా రీట్వీట్లు చేశారు. ఇప్పటికి రకరకాల ట్వీట్లతో ఈ వీడియో ట్వీటర్‌లో హల్‌చల్‌ చేస్తుంది.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు