స్వీయ నిర్బంధంలో సీఎం సోదరి

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్లంతా స్వీయ నిర్బంధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అధికారిక పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది.

Updated : 17 Aug 2022 12:27 IST

భువనేశ్వర్‌: కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్లంతా స్వీయ నిర్బంధం చేసుకోవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అధికారిక పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా నుంచి తిరిగి వచ్చిన సీఎం నవీన్‌ పట్నాయక్‌ సోదరి గీతా మెహతా స్వీయ గృహనిర్బంధం చేసుకున్నారు. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సీఎం ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండిపోయారు. ‘నిబంధనల ప్రకారం.. విదేశం నుంచి వచ్చిన నా సోదరి వివరాలు పోర్టల్‌లో నమోదు చేశాను’ అని ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసున్నాను. విదేశాల నుంచి వచ్చిన 24 గంటల్లోపు మీ పేరు పోర్టల్‌లో నమోదు చేసుకోండి. అందుకు టోల్‌ఫ్రీ 104కు ఫోన్‌  చేసి లేదా covid19.odisha.gov.in వెబ్‌సైట్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వానికి సహకరించి వైరస్‌ను అడ్డుకోవడంలో భాగస్వాములవండి’ అని ఆయన పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నారు. స్వయంగా వెల్లడించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా ఇప్పటి వరకూ పోర్టల్‌లో 1,239మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేసుకోవడంతో పాటు స్వీయ నిర్బంధం చేసుకున్నవారికి ప్రభుత్వం రూ.15వేలు ప్రోత్సాహకం ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని