మాస్క్‌లతో పరీక్షకు హాజరైన పది విద్యార్థులు

తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గంట ముందే పరీక్ష కేంద్రాల వద్ద ఉండాలన్న అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులు ఆయా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 8.30 నుంచే

Published : 19 Mar 2020 10:04 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గంట ముందే పరీక్ష కేంద్రాల వద్ద ఉండాలన్న అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులు ఆయా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 8.30 నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు దాదాపు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం, అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను ప్రత్యేక గదుల్లో పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నారు.

ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మించకుండా పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అబిడ్స్‌, శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాల, నాగార్జున గ్రామర్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు బారులు తీరారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. 



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు