మోదీజీ.. తెలుగు విద్యార్థులను ఆదుకోండి: కేటీఆర్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశాలకు రప్పించేందుకు చొరవ చూపాలని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న కొంత మంది విద్యార్థులు తమను స్వదేశాలకు...

Updated : 19 Mar 2020 16:32 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశాలకు రప్పించేందుకు చొరవ చూపాలని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న కొంత మంది విద్యార్థులు తమను స్వదేశాలకు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలంటూ కేటీఆర్‌ను ట్విటర్‌ ద్వారా కోరుతున్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ప్రధాని మోదీని ట్విటర్‌ ద్వారా అభ్యర్థించారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా, సింగపూర్, రోమ్, కౌలాలంపూర్ విమానాశ్రయాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని మోదీని కోరారు. 

మనీలాలో చిక్కుకొన్న ఏపీ, తెలంగాణకు చెందిన 80 మంది విద్యార్థులు కౌలాలంపూర్‌ మీదుగా విశాఖ వచ్చేందుకు ఎయిర్‌ ఏసియా విమానంలో టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ, భారత్‌కు వచ్చే విమాన సర్వీసులు మంగళవారం నుంచి రద్దు చేయడంతో వారు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. వీరిలో కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం సహా తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌ ప్రాంత వాసులు కూడా ఉన్నారు. భారత్‌కు వెళ్లలేక, ఫిలిప్పీన్స్‌లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని