Published : 19/03/2020 17:59 IST

క్రికెట్‌ ఆడిన మాజీ ముఖ్యమంత్రి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిలబడాలంటే బలపరీక్షలో నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ సూచించారు. అయితే, కరోనా ప్రభావం వల్ల ఈ నెల 26 వరకు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ ప్రకటించారు. దీంతో ఆ బలపరీక్ష వాయిదా పడినట్లయింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తాపీగా క్రికెట్‌ అడుతున్నారు. తన సహచరులతో పాటు మైదానంలో బౌలింగ్‌లో వికెట్లు తీయడంతో పాటు పాటు బ్యాట్‌ పట్టి బౌండరీలు బాదేశారు. దానికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసి ఇది ఎలా ఉంది..? అంటూ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. మీరు ఒక సంవత్సరం నుంచి బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ కమల్‌నాథ్‌ వికెట్‌ పడగొట్టలేకపోయారు. మీకంటే వేగంగా బౌలింగ్‌ చేసే భాజపా నేతలతో ప్రయత్నించాల్సిందే. ఇప్పటికల్లా ఆయన వికెట్‌ పడిపోయేది.. అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘22 వికెట్లు తీసిన మాజీ ముఖ్యమంత్రి అంటూ మరికొంతమంది స్పందించారు.

 

 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని