‘కరోనా’పై హైదరాబాద్‌ పోలీసుల అవగాహన

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్‌

Published : 19 Mar 2020 20:17 IST

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్‌ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు కొత్తపేట కూడలి వద్ద వాహనదారులను ఆపి వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా ప్రదర్శన రూపంలో చూపించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. మనుషుల మధ్య మీటరు దూరం పాటించాలని.. అదేవిధంగా షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండా నమస్కారం పెట్టాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనాని నియంత్రించగలమని.. అందుకే అందరూ పరిశుభ్రతను పాటించాల్సిందిగా ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని