కరోనానా.. కాసేపు ఎండలో కూర్చొండి

ఒకవైపు కరోనా వైరస్‌ దేశంలో విస్తరిస్తుంటే మరోవైపు ప్రజాప్రతినిధులు దాని నివారణకు ఇచ్చే సలహాలు వింతగా ఉంటున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ

Updated : 19 Mar 2020 22:04 IST

దిల్లీ: ఒకవైపు కరోనా వైరస్‌ దేశంలో విస్తరిస్తుంటే మరోవైపు ప్రజాప్రతినిధులు దాని నివారణకు ఇచ్చే సలహాలు వింతగా ఉంటున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినిచౌబే గురువారం మీడియాతో మాట్లాడుతూ మిట్టమధ్యాహ్నం ఒక 15 నిమిషాలు ఆరుబయట ఎండలో కూర్చుంటే కరోనా దరిచేరదన్నారు. సూర్యుని కిరణాల నుంచి వచ్చే వేడితో విటమిన్‌ డి లభిస్తుందని, తద్వారా రోగనిరోధకశక్తి పెరిగి కరోనా వైరస్‌ అంతమౌతుందన్నారు. గతంలో ఈయనే గోమూత్రం తాగితే క్యాన్సర్‌ను నివారించవచ్చునన్నారు. ఒకవైపు ప్రధాని మోదీ కరోనావైరస్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులెవ్వరూ కూడ అశాస్త్రీయమైన, అర్ధంలేని సలహాలు ఇవ్వరాదని సూచించారు. ట్వీట్‌లు కూడా చేయరాదన్నారు. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా నివారణ మార్గాల జాబితాలో కూడా విటమిన్‌ డి అంశం లేదు. ప్రస్తుతం కరోనావైరస్‌ దేశంలో మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కార్యాచరణను అమలుచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని