ఆరు నెలల రేషన్‌ సరకులు ముందుగానే

కరోనా వ్యాప్తిని నియంత్రించే దిశగా కేంద్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. లబ్దిదారులు ఆరు నెలలకు సరిపడా రేషన్‌ సరుకులను ఒకేసారి తెచ్చుకునేందుకు వీలుగా అవకాశం కల్పించనుంది.

Updated : 19 Mar 2020 19:06 IST

దిల్లీ: కరోనా వ్యాప్తిని నియంత్రించే దిశగా కేంద్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. లబ్దిదారులు ఆరు నెలలకు సరిపడా రేషన్‌ సరకులను ఒకేసారి తెచ్చుకునేందుకు వీలుగా అవకాశం కల్పించనుంది. ఈ విధానాన్ని పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. గరిష్ఠంగా రెండు నెలలకు మాత్రమే సరకులు తీసుకునేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే కరోనాను కట్టడి చేసే చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌరసరఫరాల శాఖామంత్రి రాం విలాస్‌ పాసవాన్‌ తెలిపారు. కరోనా నేపథ్యంలో రేషన్‌ దుకాణాల వద్ద తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 75 కోట్ల మంది ప్రజలు ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి లబ్ధి పొందుతున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని