ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు:కేసీఆర్
కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు సీఎం
హైదరాబాద్: కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించినట్లు స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. మార్చి1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను రానున్న రెండు మూడు రోజుల్లో గుర్తించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు లేవని.. అయినా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు. చైనా పక్కనే ఉన్న వియత్నాం తొలి నుంచీ కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలు పాటించడంతో అక్కడ ఎలాంటి కేసులూ నమోదు కాలేదని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.
ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి లేదు
ఇంతకుముందు థియేటర్లు, మాల్స్ మూసివేతను వారం రోజులుగా నిర్ణయించినా.. దాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించవద్దని ఆదేశాలిచ్చామన్నారు. వీలైనంత వరకు విదేశాల నుంచి వచ్చిన వారే స్వయంగా ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని అందించాలని కోరారు. స్వచ్ఛందంగా క్వారంటైన్లకు తరలివెళ్లాలని కేసీఆర్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను రద్దు చేశామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేస్తామని.. ప్రజలు ఇళ్ల నుంచే వీక్షించవచ్చని సీఎం వివరించారు.
సరిహద్దు రాష్ట్రాల వద్ద 18 చెక్‌పోస్టులు
‘ప్రజా రవాణాకు సంబంధించి బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు తదితర వాహనాల్లో హై శానిటేషన్ చేపట్టాలని ఆదేశించాం. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులకు సూచించాం.. రేపటి నుంచి దాన్ని అమల్లోకి తీసుకొస్తాం. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలిసిన తర్వాత జిల్లా స్థాయిలో వేసిన కమిటీలు హోం క్వారంటైన్ చేస్తాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎంహెచ్‌వో కమిటీలో ఉంటారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1165 మందిని వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉంచాం. కొంతమంది ఇళ్లకే వెళ్తాం అంటున్నారు. అలాంటి వారిని ఇళ్లకు పంపించినా అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. విదేశాల నుంచి ఎవరు వచ్చినా వారిపై నియంత్రణ ఉంచాలని నిర్ణయించాం. రైళ్లలో చేపట్టాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడాం. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దుగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల సరిహద్దుల వద్ద 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి తెలంగాణలోకి అనుమతిస్తాం’ అని చెప్పారు.
యథావిధిగా పదోతరగతి పరీక్షలు
మన రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చినవారే. రాష్ట్రంలో ఉన్నవారిలో ఎవరికీ సోకలేదు. విద్యార్థులు ఇప్పటికే సిద్ధమైనందున పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగిస్తాం. ఆయా పరీక్ష కేంద్రాల్లో హై శానిటేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించాం. తల్లిదండ్రులు కూడా పరీక్షలు జరగాలనే కోరుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రతిరోజూ బ్లీచింగ్ చేయడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సూచనలు పాటించాలి’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
గుంపులుగా గుమిగూడొద్దు..
‘ప్రజలకు నిత్యావసరాలు అందించే దుకాణాలు తెరిచే ఉంటాయి. అయితే అక్కడ జనసమ్మర్ధం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్నందున నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించాం. ప్రజలు ఎక్కడా గుంపులు గుంపులుగా గుమిగూడవద్దు. మాకేం అవుతుందనే నిర్లక్ష్యం మంచిది కాదు. వ్యక్తిగత, గ్రామ, పట్టణ పారిశుద్ధ్యంతో పాటు రాష్ట్రాన్ని, పిల్లల్ని కాపాడుకుందాం. వైరస్ మనదేశంలో పుట్టింది కాదు. రాష్ట్రంలో నమోదైన కేసులు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఐసోలేషన్‌లో ఉన్న వారంతా కోలుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు’ అని సీఎం వివరించారు.
ముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష
‘రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 తర్వాత కల్యాణ మండపాలు మూసివేస్తాం. ఒకవేళ ముందే నిర్ణయమైన వివాహాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 200 మందికి మించకుండా పూర్తి చేసుకోవాలి. రాష్ట్రంలో అంత భయానక పరిస్థితులు లేవు. కాకపోతే అందరూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష. స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విదేశాల నుంచి వచ్చే విమానాలను ఈనెల 22 నుంచి కాకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. రేపు ప్రధాని మోదీతో జరిగే ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తా’ అని సీఎం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్‌బై
-
ఆప్‌కు మరో షాక్.. సత్యేందర్ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు