‘‘హోమ్‌క్వారంటైన్‌’’తోనే కరోనా నివారణ

ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో కల్లోలం అవుతోంది. ఒకరినుంచి ఒకరికి ప్రత్యక్షంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేయాలంటే బాధిత వ్యక్తి

Published : 19 Mar 2020 21:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో కల్లోలం అవుతోంది. ఒకరినుంచి ఒకరికి ప్రత్యక్షంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేయాలంటే బాధిత వ్యక్తి జనసమూహంలోకి వెళ్లకుండా నివారించడం ఒక్కటే మార్గం. మనదేశంలో నమోదవుతున్న కేసులన్నీ ఇక్కడికి వస్తున్న విదేశీయులనుంచో లేదా  తిరిగొస్తున్న భారతీయుల వల్లనో నమోదవుతున్నాయి. అలా వచ్చినవారు 14 రోజులుపాటు హోమ్‌క్వారంటైన్‌(స్వీయ గృహనిర్భంధం)లో ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల వారు వైరస్‌ ప్రభావానికి గురయ్యారో లేదో  తెలుస్తుంది. అయితే ఇక్కడే చిక్కొచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారు ప్రభుత్వాదేశాలను బేఖాతరు చేస్తూ సమాజంలో తిరుగుతున్నారు. దీంతో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే చేతిపై స్టాంపింగ్‌..
అంటే ఏమిటి..?
విదేశాల నుంచి వచ్చినవారిని ఎయిర్‌పోర్టలోనే కొవిడ్‌-19 నిర్థారిత పరీక్షలు చేసి ఆ లక్షణాలు ఎక్కువ మోతాదులో కనిపించిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. ఆ లక్షణాలు లేనివారికి అరచేతి వెనుకవైపు చెరిగిపోనివిధంగా నీలంరంగు స్టాంపును ముద్రిస్తున్నారు. దీనిపై తేదితోపాటు ‘హోమ్‌ క్వారంటైన్’ తీసుకొవాల్సిందిగా సూచిస్తూ రాసి ఉంటుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా. రణదీప్ గులేరియా తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్ది ఆసుపత్రులలో బెడ్‌ల సమస్య ఏర్పడుతుంది. అనుమానం ఉన్న ప్రతిఒక్కరిని ఆసుపత్రిలో ఉంచితే అవి చాలవు, అందుకే ఎవరికివారు స్వీయగృహనిర్బంధం చేసుకోవడం అవసరమని ఆయన సూచించారు. అలాగే ఎయిమ్స్‌, సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రులలో ఇతర శస్త్రచికిత్సలకు సంబంధించి అపాయింట్‌మెంట్లను కూడా రద్దుచేసినట్టు ఆయన తెలిపారు.
                                           

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని