
సెర్బియా నిర్బంధం నుంచి నిమ్మగడ్డ విడుదల
హైదరాబాద్: పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. వాన్‌పిక్ వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా సెర్బియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది జులైలో ఆయన సెర్బియాలో ఉండగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నిమ్మగడ్డ అరెస్ట్ చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆయన విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అధికారులు నిమ్మగడ్డ ప్రసాద్‌ను క్వారంటైన్‌కు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.