కరోనా అనుమానం.. పోలీసుల అదుపులో గోదావరి యువకుడు

ఎల్బీనగర్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. దుబాయి నుంచి ముంబయి చేరుకున్న ఈ యువకుడిని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్‌ చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated : 21 Mar 2020 00:59 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. దుబాయి నుంచి ముంబయి చేరుకున్న ఈ యువకుడిని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్‌ చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులో పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్తుండగా.. యువకుడి చేతికి ఉన్న ముద్రను చూసి తోటి ప్రయాణికులు ఆరా తీశారు. దీంతో సదరు యువకుడు కంగారు పడిపోయాడు. అతడి ప్రవర్తనతో అనుమానం వచ్చిన ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దింపేశారు. అనంతరం అధికారులకు సమాచారమిచ్చారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎల్బీనగర్‌ పీఎస్‌కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని