న్యుమోనియా ఉన్నవారికి కరోనా పరీక్షలు

కరోనా వ్యాప్తి చెందుతున్న మార్గాలను కనిపెట్టి ఎక్కడికక్కడే వైరస్‌ను కట్టడిచేయాలన్న లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు ఉపక్రమించింది. తమిళనాడు, మహారాష్ట్రలో ఎలాంటి విదేశీ ప్రయాణం చేయని వారికి సైతం కరోనా సోకింది.

Published : 22 Mar 2020 01:47 IST

దిల్లీ: కరోనా వ్యాప్తి చెందుతున్న మార్గాలను కనిపెట్టి ఎక్కడికక్కడే వైరస్‌ను కట్టడి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు ఉపక్రమించింది. తమిళనాడు, మహారాష్ట్రలో ఎలాంటి విదేశీ ప్రయాణం చేయని వారికి సైతం కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల సమస్యలు(న్యుమోనియా) ఎదుర్కొంటున్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ కేవలం విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు కరోనా బాధితులతో కలిసిన వారికి మాత్రమే పరీక్షలు చేసింది. తాజా పరిణామాలతో న్యుమోనియా ఉన్నవారిందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స అందుకుంటున్న వారి వివరాలను ప్రభుత్వ వైద్యాధికారులు ఎన్‌సీడీసీ(నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌)కు అందించాలని సూచించింది. తద్వారా వాళ్లకు పరీక్షలు చేసి బాధితులను సులభంగా కనిపెట్టవచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని