జనతా కర్ఫ్యూలో పాల్గొనండి: ఉత్తమ్‌

ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు రేపు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో మీడియాతో...

Updated : 21 Mar 2020 18:49 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రేపు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వస్తున్న వారిలోనే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. అవసరమైతే ప్రజలు స్వీయనిర్బంధంలోకి వెళ్లాలన్నారు.

రేపు జనతా కర్ఫ్యూలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరూ బయటకు రాకుండా ఉంటే కొంత మేర ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను చైతన్యపరుస్తూ నియంత్రణ చర్యలపై ప్రజలకు అవగాహన  కల్పించాలన్నారు. కర్ఫ్యూ వల్ల పేదలు, దినసరి కూలీలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున.. తెలుపు రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలు సరఫరా చేయాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని