అధికారులతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

కరోనా వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తుండడంతో అధికారులు, వైద్య నిపుణులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌-19 నివారణ చర్యలపై క్యాంపు

Published : 21 Mar 2020 23:41 IST

అమరావతి: కరోనా వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తుండడంతో అధికారులు, వైద్య నిపుణులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌-19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కొవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్ష జరిగింది. మనం కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కోవాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు పటిష్టమైన వైద్య, ఆరోగ్య యంత్రాంగం మనకు ఉందని సీఎం పేర్కొన్నారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోందన్నారు. ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనతా కర్ఫ్యూకు ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని జగన్‌ కోరారు. రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ ఉండనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించి ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని