దిల్లీ, మహారాష్ట్రలో 144 సెక్షన్‌ విధింపు

మహారాష్ట్రను కరోనా కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కోరారు. సోమవారం ఉదయం వరకూ కొనసాగించాలని ప్రజలకు..

Published : 22 Mar 2020 16:35 IST

ముంబయి: దేశాన్ని కరోనా కుదిపేస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీతో పాటు మహారాష్ట్రలో 144 సెక్షన్‌ విధించారు. దిల్లీలో ఈరోజు రాత్రి 9గంటల నుంచి మార్చి 31 వరకు ఈ నిబంధన అమలులో రానుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. సోమవారం ఉదయం వరకూ కొనసాగించాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని తెలిపారు. 

‘‘రాష్ట్రంలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్ప మరే మార్గం లేదు. అందుకు రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధిస్తున్నాం. ఐదుగురు కంటే ఎక్కువ మంది కలిసి రోడ్లపై కనిపించకూడదు. విదేశాల నుంచి ఒక్క విమానం కూడా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. వైరస్‌ వ్యాప్తి క్రమంగా రెట్టింపవుతున్న క్రమంలో ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నవారు మరికొంతకాలం ఇంట్లోనే ఉండాలి’ అని ఠాక్రే ప్రజలను అభ్యర్థించారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలోని మిగితా రాష్ట్రాలన్నింటికి కంటే ముందుంది. అక్కడ ఇప్పటివరకు 70 కరోనా కేసులు నమోదు కాగా.. దిల్లీలో 27 మందికి కరోనా సోకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని