తగ్గిన శానిటైజర్ల ధరలు

దేశంలోని నిత్యావసరాల తయారీ కంపెనీలు (ఎఫ్‌ఎంసీజీ) ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హ్యాండ్‌ శానిటైజర్ల (చేతులు శుభ్రం చేసుకునే ద్రావణాల) ధరలను తగ్గించాయి.

Published : 23 Mar 2020 07:12 IST

దిల్లీ: దేశంలోని నిత్యావసరాల తయారీ కంపెనీలు (ఎఫ్‌ఎంసీజీ) ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హ్యాండ్‌ శానిటైజర్ల (చేతులు శుభ్రం చేసుకునే ద్రావణాల) ధరలను తగ్గించాయి. కొవిడ్‌-19 భయాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హ్యాండ్‌ శానిటైజర్లకు ఏర్పడిన గిరాకీని అందుకునేందుకు ఉత్పత్తిని పెంచినట్లు చెప్పాయి. తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం నెలకొన్న తరుణంలో జాతికి అండగా ఉంటామని హ్యాండ్‌ శానిటైజర్ల తయారీ కంపెనీలైన ఆర్‌బీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, గోద్రెజ్‌ కన్జ్యూమర్‌, హిమాలయ, డాబర్‌లు స్పష్టం చేశాయి. 200 మిల్లీ లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్‌ గరిష్ఠ ధరను రూ.100కు పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ధర జూన్‌ 30వరకు అమల్లో ఉండనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు