తెలంగాణ లాక్‌డౌన్‌పై ఉత్తర్వులు జారీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఈనెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదివారం దీనిపై చేసిన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌...

Updated : 23 Mar 2020 17:33 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఈనెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదివారం చేసిన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధుల నియంత్రణ చట్టం -1897, విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాల్లో ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే మహమ్మారిగా ప్రకటించిందని.. తెలంగాణకు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా కీలక చర్యలు చేపట్టినట్లు ఆదేశాల్లో సీఎస్‌ పేర్కొన్నారు. 

కరోనా నియంత్రణకు ఈనెలాఖరు వరకు ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావొద్దని.. నిత్యావసరాలకు సైతం ఒక్కరే వెళ్లాలని ఇప్పటికే కేసీఆర్‌ సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దును సైతం మూసివేసి ప్రజా రవాణాను బంద్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఏయే సేవలు అందుబాటులో ఉండనున్నాయి.. ఏమేం మూత పడనున్నాయనే దానితోపాటు ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలను ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ ఆదేశాల ప్రతి కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని